ఛావా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఛావా సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే 400 కోట్ల కలెక్షన్స్ దాటిపోవటం హైలైట్.
విక్కీ కౌశల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా బాక్సాఫీస్ కలెక్షన్స్ కురిపిస్తున్న ఛావా 400 కోట్ల క్లబ్ లో చేరి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. శంభాజీ మహరాజ్ గా విక్కీ కౌశల్ నటించగా, రాణిగా రష్మిక, ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించారు. సింగం ఎగైన్, తన్హాజీ వంటి సినిమాలు 400 క్రోర్స్ క్లబ్ లో ఉండగా ఇప్పుడు ఛావా కూడా ఈ క్లబ్ లో చేరటం విశేషం.
ఛావాలో నటించినందుకు విక్కీ కౌశల్ 20 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం, కాగా రాణి పాత్రలో నటించిన రష్మిక మందన్నకు 4 కోట్ల పారితోషికం ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. సినిమా రిలీజ్ అయి 9రోజులు కాగా ఇంకా హౌస్ ఫుల్ గా బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్లు రాబడుతోండటం హైలైట్.