Sunday, February 23, 2025
Homeఆంధ్రప్రదేశ్Nandyala: నల్లమల శ్రీశైల కాలినడక భక్తులకు సేవలు భేష్

Nandyala: నల్లమల శ్రీశైల కాలినడక భక్తులకు సేవలు భేష్

శివరాత్రికి పాదయాత్ర

భూకైలాసంగా విరాజిల్లుతూ భక్తుల కోర్కెలు తీరుస్తున్న శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని దర్శించుకునేందుకు వందల కిలోమీటర్లు దూరం కాలినడకన నల్లమల అరణ్యం గుండా భక్తులు వస్తున్నారని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఆదివారం నల్లమల అరణ్యంలోని పెచ్చేరువు చెంచుగూడెంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కాలినడక భక్తులను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ఏడాది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కాలినడకన నల్లమల అరణ్యం గుండా శ్రీశైలం పుణ్య క్షేత్రం వచ్చే భక్తులకు ప్రభుత్వం, దాతలు అందిస్తున్న అన్ని సేవలు మెరుగ్గా ఉన్నాయని, అడవిలో భక్తులకు ఎలాంటి లోటు లేకుండా నంద్యాల జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఆహారం, వైద్యం, తాగునీరు, అందుబాటులో అంబులెన్సు సదుపాయం అందిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అన్నిశాఖ అధికారులు సమన్వయం ముందుకు సాగుతున్నారని ఎంపీ శబరి వివరించారు. పెచ్చేరువులో దాతల అన్నదానం కేంద్రాలు, ప్రభుత్వ మెడికల్ క్యాంపులు, ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ, శ్రీశైల శివ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సందర్శించి, స్వయాన డాక్టర్ అయినా ఎంపీ శబరి ఉచిత మెడికల్ క్యాంపులో కాలినడకన పెచ్చేరువు చేరుకున్న భక్తులకు వైద్య సేవలు అందించారు. దాతలు ఏర్పాటు చేసిన అన్నదానం కేంద్రంలోనే ఎంపీ శబరి భోజనం చేసి భక్తులు అందుతున్న నాణ్యమైన ఆహారాన్ని పరిశీలించారు.

- Advertisement -

నంద్యాల జిల్లా అభివృద్ధి చెందేలా దీవించాలని కోరుతూ శ్రీశైల పాదయాత్ర

ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభో శంకర, మమ్ము చేదుకో మల్లన్న అంటూ నల్లమల అరణ్యంలో ఓంకార నినాదాలతో మారు మ్రోగుతూ వేలాది మంది అనుచరులు, భక్తులు ఆధ్యాత్మిక ఆనందోత్సవాల మధ్య నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి బ్రహ్మోత్సవాలలో శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకునేందుకు నల్లమల అభయారణ్యంలో సుమారు 50 కిలోమీటర్ల దూరం కాలినడక పాదయాత్ర చేపట్టారు.

సమస్యలు అడిగి తెలుసుకుంటూ పాదయాత్ర

ఆదివారం ఉదయం శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలోని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి శ్రీ మల్లేశ్వరస్వామీ ఆలయంలో విశేష పూజలు నిర్వహించి పాదయాత్ర మొదలుపెట్టారు. వెంకటాపురం గ్రామ పెద్దలు, శివాలయం అర్చకులు ఎంపీ శబరికి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం గోసాయికట్ట శ్రీ వీరాంజనేయస్వామికి విశేష పూజలు చేసి, ముర్తుజావలి దర్గాలో దువా సమర్పించి పాదయాత్రగా నాగలూటి చెంచు గూడెం పాఠశాలను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నాగలూటి శ్రీ వీరభధ్రస్వామి ఆలయంలో పూజలు చేసి పెద్ద దేవలాపురం భక్త బృందం ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకొని రెడ్డి రాజులు నిర్మించిన తాపలు ( రాతి మెట్ల మార్గం) ద్వారా శ్రీశైలంకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కాలినడకన సాయంత్రం 4 గంటలకు పెచ్చేరువు చెంచు గూడెంకు ఎంపీ శబరి పాదయాత్ర సాగింది.

భీముని కొలనులోనే సేదతీరి

వేలాది మంది భక్తులు, కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు, మన తెలుగు భక్తులు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరితో ఫోటోలు, సెల్ఫీలకు అడవిలో పోటీ పడడం, ప్రభుత్వం కాలినడకన శ్రీశైలం వచ్చే భక్తులకు చేసిన ఏర్పాట్లు పరిశీలిస్తూ, చెంచు మహిళలు, గూడెం పెద్దలతో వారి సమస్యలు తెలుసుకుంటూ ఎంపీడాక్టర్ బైరెడ్డి శబరి కాలినడక ప్రయాణం ఆలస్యంగా సాగుతోంది. దీంతో ఆదివారం రాత్రి నల్లమల అరణ్యం భీమునికొలనులోనే ఎంపీతో పాటు నడచి వచ్చిన వందలాది మంది భక్తులు సేద తీరనున్నారు. సోమవారం ఉదయం శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను ధూళిదర్శనం చేసుకొనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News