Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్Nandavaram: అంగరంగ వైభవంగా శ్రీ బండేగురు స్వామి ప్రభోత్సవం

Nandavaram: అంగరంగ వైభవంగా శ్రీ బండేగురు స్వామి ప్రభోత్సవం

వైభవంగా జాతర

నందవరం మండల పరిధిలోని పూలచింత గ్రామంలో ఆదివారం శ్రీ గురు దత్తాత్రేయ పీఠము శ్రీ సద్గురు బండే గురు 119 వ జాతర మహోత్సవం పురస్కరించుకొని మఠం ఐదవ పీఠాధిపతులు శ్రీ జయ శంకర స్వామి వారి సత్సంకల్పంతో ఉప పీఠాధిపతులు శ్రీ బండే గురు స్వామి వారి ఆధ్వర్యంలో ప్రభవోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించారు.

- Advertisement -

మఠంలో కోలాహలం

ఈ జాతర మహోత్సవమును పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేసి, అనంతరం వచ్చిన భక్తాదులకు అన్న ప్రసాదాలను ఏర్పాటు చేశారు. జాతర మహోత్సవం సందర్భంగా శ్రీ జయ శంకర స్వామి వారి శిష్యు బృందం వారి గురుదేవులైన జయ శంకర స్వామి వారి పాద చరణ సేవకై తండోపతండాలుగా తరలివచ్చిన భక్తజన సందోహంతో గ్రామ పురవీధులు, మఠం ప్రాంగణం భక్తుల కోలాహలంతో కిక్కిరిసిపోయినది. గురుదేవుని సేవలో వారి శిష్యులు పరవశించి గాన పారాయణలతో మైమరిచిపోయారు.

పల్లకి సేవలు

స్వామివారి సేవకై స్థానిక భక్తజనులతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో భక్తజన సందోహం సంద్రాన్ని తలపించింది. మధ్యాహ్నం నుండి స్వామివారికి పల్లకి నందికొలు సేవ నిర్వహించి స్వామివారి మూలస్థానానికి పూజలు నిర్వహించారు. సాయంత్రం గోధూళి సమయాన శివనామ స్మరణల నడుమ భాజా భజంత్రీలతో ప్రబోత్సవమును ఘనంగా నిర్వహించారు. రాత్రి అఖండ భజనా కార్యక్రం నిర్వహించడంతో భక్తులు తన్వయత్వములో మునిగిపోయారు.

జాతరలో స్థానికులంతా

గ్రామంలో ప్రతి ఇంటిలో ఆడపడుచులు అల్లుళ్లు, చిన్నారులు, బంధుమిత్రులతో ఎంతో భక్తిశ్రద్ధలతో జాతరను జరుపుకున్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బండే గురుస్వామి ఆధ్వర్యంలో కార్యనిర్వాహకులు భక్తులకు వసతి, భోజన, రవాణా సౌకర్యాలతో పాటు సకల సౌకర్యములను ఏర్పాటు చేశారు. ఇందుకు భక్తులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ బి.వి జయనాగేశ్వర రెడ్డి హాజరయ్యారు. జాతర మహోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నందవరం ఎస్సై శ్రీనివాసులు పర్యవేక్షణలో వారి సిబ్బంది పూర్తి భద్రతను కల్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News