నేచురల్ స్టార్ నాని(Nani) వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు. గతేడాది ‘సరిపోదా శనివారం’ మూవీతో పలకరించిన నాని.. ఇప్పుడు హిట్ 3తో ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమయ్యాడు. ‘హిట్’ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న ‘హిట్3: ది థర్డ్ కేస్’. శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా మూవీ యూనిట్ ‘హిట్ 3’ టీజర్ (HIT3 Teaser) విడుదల చేసింది. వరుస హత్యల్లో మిస్టరీని ఎలా చేధించాడు అనే కోణంలో ఈ సినిమా సాగనుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ మే 1న విడుదల కానుంది.
Hit 3 Teaser: నాని బర్త్ డే స్పెషల్.. అదిరిపోయిన హిట్-3 టీజర్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES