ఏపీ కమాండ్ కంట్రోల్ రూమ్ పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు. ఈ తరహా కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించారు. దీంతో వినియోగదారుల చట్ట ప్రకారం ఆన్ లైన్ తో పాటు రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుండైనా నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఫిర్యాదులు అందిన వెంటనే సత్వర పరిష్కారం అవుతుంది. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం-2023 సందర్భంగా వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ..వ్యాపారస్తులందరూ నిబంధనల మేరకు వ్యాపార లావాదేవీలు నిర్వహించాలని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ సునీల్ చౌదరి మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల పరిరక్షణతో పాటు వినియోగదారులుగా వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో 17 జిల్లా వినియోగదారుల కమిషన్ లు పనిచేస్తున్నాయన్నారు. అన్యాయం జరిగిందని వచ్చే వినియోగదారులకు కమిషన్ బాసటగా నిలుస్తుందన్నారు. వినియోగదారులు మోసపోయే కేసుల్లో ఎక్కువగా బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందినవేనన్నారు.
AP: ఏపీ కమాండ్ కంట్రోల్ రూమ్ పై కేంద్రం ప్రశంసలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES