కులగణన చేపట్టి, బిసి కులాల లెక్కలు తేల్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది యాదవ సంఘం. ఈమేరకు హైదరాబాద్ లోని ఆదర్శ్ నగర్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో యాదవులు సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం సాగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది యాదవులు ఉత్సాహంగా పాల్గొన్నారు. టీపీసీసీ యాదవ్ నాయకులు వజ్రేష్ యాదవ్, చరణ్ కౌశిక్ యాదవ్, గజ్జి భాస్కర్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.

అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ మాట ఇచ్చినట్టే తెలంగాణలో బీసీ కులగణన జరిగిందని, అన్ని కులాల వారిగా యాదవ్ ల తరఫున ధన్యవాద సభ పెట్టుకున్నట్టు తెలిపారు. కృతజ్ఞత సభ ద్వారా రాహుల్ గాంధీ సోనియాగాంధీ, సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ ఇవ్వ లేదు అని బీఅరెస్ అంటుందని సభ భగ్గుమంది. రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ ఇవ్వలేదు అన్నవాళ్ళు కులగణన తప్పులు తడక అంటే ఎవరు నమ్ముతారని యాదవ సంఘం ధ్వజమెత్తింది.

