వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైయస్ జగన్ సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి, అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన ప్రజా సమస్యలపై వైసీపీ ఈ కీలక భేటీ నిర్వహించింది. ఈరోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా జగన్ తో సహా 11 మంది పార్టీ ఎమ్మెల్యేలంతా సభకు హాజరయ్యారు.

