Monday, February 24, 2025
Homeనేషనల్PM Kisan: పీఎం కిసాన్ నిధులు విడుదల

PM Kisan: పీఎం కిసాన్ నిధులు విడుదల

రైతులకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద అందించే పీఎం కిసాన్‌ (PM Kisan) 19వ విడత నిధులు విడుదలయ్యాయి. బీహార్‌లోని భాగల్పూర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ(PM Modi) ఈ నిధులను విడుదల చేశారు. 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.22వేల కోట్లు జమయ్యాయి. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ సందర్శించండి. డబ్బులు జమ కాకపోతే ఈకెవైసీ అప్‌డేట్ చేసుకోండి.

- Advertisement -

మరింత సమాచారం కావాలంటే పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నెంబ‌రు 155261 / 011-24300606కు కాల్ చేసి స‌మాచారం తెలుసుకోండి. కాగా రైతులకు ఏటా ఒక్కో విడత రూ.2వేల చొప్పున మూడు విడతల్లో రూ.6వేల సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని కేంద్రం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News