విదేశాల్లో డిమాండ్ తగ్గడంతో మిర్చికి గిట్టుబాటు ధర తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో రైతులు(Chilli farmers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మిర్చి రైతుల ఇబ్బందులపై ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అలాగే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తోనూ భేటీ అయ్యారు. చంద్రబాబు ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి.
క్వింటా మిర్చికి రూ.11,781 ధర ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద ఈమేరకు మిర్చికి ధరను ప్రకటించింది. ఈ ధరను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చెరో సగం భరించనున్నాయి. ఏపీ నుంచి 2.58లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి సేకరణకు అవకాశం కల్పించింది. నెల రోజుల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయి.