Monday, February 24, 2025
Homeఆంధ్రప్రదేశ్Banaganapalli: యాగంటిలో శివరాత్రి జాతర ఏర్పాట్ల పరిశీలన

Banaganapalli: యాగంటిలో శివరాత్రి జాతర ఏర్పాట్ల పరిశీలన

శివరాత్రి జాతరకు..

బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బి చంద్రుడు, ఎంపీడీవో బి వెంకట రమణ, తహసిల్దార్ నారాయణ రెడ్డి, సీఐ ప్రవీణ్ కుమార్, యాగంటి పల్లె ఉపసర్పంచ్ బండి మౌళేశ్వర్ రెడ్డి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.

- Advertisement -

మూడు రోజులు టోల్ గేట్ వసూలు చేయరు

భక్తుల రద్దీని దృష్టిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు ఏర్పాటు, చలువ పందిళ్ళు, పెద్ద పుష్కరిణి, వాహనాల పార్కింగ్ కొరకు ఏర్పాటు చేసిన స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో బి చంద్రుడు మాట్లాడుతూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు 25, 26, 27 తేదీల్లో మూడు రోజులపాటు వాహనాల టోల్ గేట్ వసూలు చేయమని వెల్లడించారు.

ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ

ప్రతి భక్తులకి లడ్డు ప్రసాదం ఉచితంగా అందజేస్తామని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాలతో డెకరేషన్ తో పాటు ఆలయాన్ని సుందరంగా అలంకరించినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, తాగునీరు, వైద్య శిబిరం, అన్నదాన కార్యక్రమాలు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News