Tuesday, February 25, 2025
HomeతెలంగాణMLC Elections: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

MLC Elections: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) ప్రచారం నేటితో ముగియనుంది. సాయంత్రం 4 గంటల వరకే అనుమతి ఉండటంతో అభ్యర్ఠులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రధాన పార్టీల కీలక నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఫిబ్రవరి 27 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌కు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

- Advertisement -

మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల స్థానంలో 56 మంది పోటీలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 3,41,313 మంది ఉండగా.. 2,18,060 మంది పురుషులు, 1,23,250 మంది మహిళలు, ఇతరులు ముగ్గురు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో టీచర్ల స్థానంలో 15 మంది పోటీలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 25,921 మంది ఉండగా.. పురుషులు 16,364 మంది, మహిళలు 9,557 మంది ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News