Tuesday, February 25, 2025
HomeఆటChampions Trophy: కీలక పోరుకు సిద్ధమైన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా

Champions Trophy: కీలక పోరుకు సిద్ధమైన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా

ఛాంపియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ(Champions Trophy)లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచిన ఈ రెండు జట్లలో ఈరోజు గెలిచే జట్టు సెమీస్‌కు దూసుకెళ్లనుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు దుమ్మురేపిన సంగతి తెలిసిందే. 320 పరుగులకు స్కోర్‌ను ఛేదించి ఔరా అనిపించింది. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా అదరగొట్టాలని చూస్తోంది. ఇంగ్లిస్‌, మ్యాక్స్‌వెల్‌, షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లబుషేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్యారీ, కెప్టెన్ స్మిత్ మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.

- Advertisement -

ఇక సౌతాఫ్రికా కూడా మంచి ఊపు మీద ఉంది. తొలి మ్యాచ్‌‌లో అఫ్గానిస్తాన్‌‌పై అద్భుతమైన విజయం సాధించింది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో సమతూకంగా ఉంది. ముఖ్యంగా ఆసీస్ బౌలింగ్ కంటే సౌతాఫ్రికా బౌలింగ్ బలంగా ఉంది. దీంతో ఈ రెండు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీస్‌ బెర్త్ ఖరారు చేసుకున్న విషయం విధితమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News