ఫిబ్రవరిలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. మునుపెన్నడు లేని విధంగా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. ఈ పెరుగుదల పలు కారణాల వల్ల జరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగి, ముడి వసతుల కొరత, ఆర్థిక సంక్షోభం, డాలర్ మారకంలో మార్పులు ఈ ధరల పెరుగుదలకి కారణమయ్యాయి. ఈ నెల ప్రారంభం నుంచి బంగారం ధరలు ఎక్కువగా పెరిగాయి, ఇది పెట్టుబడిదారులు, సామాన్య ప్రజలు అందరినీ ఆందోళన చెందించే అంశంగా మారింది.
కొత్త సంవత్సరంతో బంగారం ధరల్లో కొన్ని మార్పులు జరిగాయి. మొదటి నెలలో కొంచెం తగ్గింపు వచ్చినప్పటికీ, ఫిబ్రవరిలో ఈ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ సమయంలో గృహ వినియోగం కోసం బంగారం కొనుగోలు చేసే వారికీ ధరల పెరుగుదల తో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో ఎన్నో సార్లు బంగారం ధరలు పెరిగినా, ఈసారి మాత్రం ధరలు గతంలో లేని స్థాయిలో పెరిగాయి.
ఫిబ్రవరి 23న 22 క్యారట్ల బంగారం ధర గ్రాముకు రూ.8045 ఉండగా, 24 క్యారట్ల బంగారం ధర రూ.8777 గా ఉంది. ఫిబ్రవరి 23న 22 క్యారట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ. 8055 కి చేరింది, అదే 24 క్యారట్ల బంగారం ధర రూ. 10 లు పెరిగి రూ.8787 కి చేరింది. ఫిబ్రవరి 25 మళ్లీ ధర 22 క్యారట్ల బంగారం ధర రూ.20 పెరిగి రూ. 8075 గా ఉంది. అంటే 10 గ్రాముల ధర రూ.80750 గా ఉన్నట్టు. అదే 24 క్యారట్ల బంగారం ధర రూ.22 లు పెరిగి రూ. 8809 అంటే 10 గ్రాముల ధర రూ.88090 లు ఉన్నట్టు. కి చేరింది. అయితే, ఈ ధరలు ఇలాగే కొనసాగుతాయో లేదా పెరుగుతాయో అనేది స్పష్టంగా చెప్పలేము. నిపుణుల ప్రకారం, వచ్చే నెలలో బంగారం ధరలు తగ్గవచ్చు.