తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత(Jayalalitha) 77వ జయంతి సందర్భంగా చెన్నైలోని పోయస్ గార్డెన్లోని ఆమె నివాసానికి సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) వెళ్లారు. ఆమె చిత్రపటానికి పూలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జయలలిత మేనకోడలు, మేనల్లుడితో కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Advertisement -
సినీ పరిశ్రమలో జయలలితతో నటించే అవకాశం తనకు వచ్చిందని గుర్తు చేసుకున్నారు. తమిళనాడు రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన జయలలిత భౌతికంగా లేకపోయినా… ఆమె అందించిన సేవలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని తెలిపారు. అమ్మగా ఆమె కీర్తి ప్రతిష్టలు కలకాలం నిలిచిపోతాయని వెల్లడించారు.