ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు సాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా శాసనమండలి(AP legislative Council)లో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో రానున్న కొత్త ప్రాజెక్టుల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి లోకేశ్ తెలిపారు. అయితే 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఎలా చెప్పారని వైసీపీ మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దీంతో అధికార కూటమి, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు రావని.. పరిశ్రమలు ఏర్పాటు పూర్తి అయిన తర్వాత ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సమాధానం ఇచ్చారు.
AP Assembly: మండలిలో కూటమి, వైసీపీ మధ్య వాగ్వాదం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES