Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: ఏపీ సీఎం చంద్ర‌బాబును క‌లిసిన వీహెచ్

CM Chandrababu: ఏపీ సీఎం చంద్ర‌బాబును క‌లిసిన వీహెచ్

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu)ని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (V Hanumantha Rao) కలిశారు. విజయవాడలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన వీహెచ్.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై కాసేపు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఏపీలో ఓ జిల్లాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దళిత సీఎం దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం త‌న‌ ప్ర‌తిపాద‌న ప‌ట్ల‌ చంద్రబాబు సానుకూలంగా స్పందించార‌ని వీహెచ్ తెలిపారు.

- Advertisement -

మరోవైపు మూడు దశాబ్దాల తర్వాత చంద్రబాబు ఇంటికి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెళ్లారు. తను రచించిన “ప్రపంచ చరిత్ర” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి దగ్గుబాటి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News