బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) సంచలన ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచిన విధానంపై ఆ పార్టీ నేత చిన్నారెడ్డి మాట్లాడిన వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
“మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేత రూ.90 కోట్లు ఖర్చు పెట్టించారని, ఓట్లు కొనుగోలు చేసే క్రమంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు 5నుంచి 10లక్షల వరకు ఇస్తామని హామి ఇచ్చి, రెండున్నర లక్షలు మాత్రమే ఇచ్చారని చిన్నారెడ్డి గారు బట్టబయలు చేసారు. ఈడీలు, సీబీఐలు, ఐటీలు, ఎన్నికల్ కమిషన్లు ఎందుకు ఈ విషయంపై నోరు మెదపడం లేదు? సుమోటోగా తీసుకొని కేసులు ఎందుకు పెట్టడం లేదు?
బీఆర్ఎస్ నాయకులపై నిరాధారమైన కేసులు పెట్టటంలో చూపించే అత్యుత్సాహం ఆధారాలున్నా, స్వయంగా క్యాబినెట్ ర్యాంకులో ఉండి, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడే చెబుతున్నా ఎందుకు పెట్టడం లేదు? కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన, రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా? రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఏ విధంగా సమర్థిస్తారు? ఏం సమాధానం చెబుతారు? బడే భాయ్, ఛోటే భాయ్ బంధానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? బిజేపీ, కాంగ్రెస్ ల చీకటి ఒప్పందానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? వెంటనే కేసులు పెట్టి, విచారణ జరపాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం” అని తెలిపారు.