తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) ప్రచారం ముగిసింది. ప్రచార సమయం ముగియడంతో ఎక్కడికక్కడ మైకులు మూగబోయాయి. దాదాపు 25 రోజుల పాటు కొనసాగిన ప్రచారంలో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా క్యాంపైన్ నిర్వహించారు. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఓట్ల లెక్కింపు మార్చి 3న జరగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్లు సులభంగా పోలింగ్ కేంద్రంలోకి చేరుకునే విధంగా మహిళలకు, పురుషులకు వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
కాగా ఏపీలో మూడు, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలించారు. 13న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది.