ఏపీ ఫైబర్‌నెట్(AP FiberNet) నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్యను నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఎండీ దినేష్‌కుమార్‌పై ఆరోపణలు రావడంతో ఆయనను ప్రభుత్వం బదిలీ చేసింది. కాగా దినేష్‌కుమార్‌తో విభేదాల నేపథ్యంలో ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
కాగా ఫైబర్‌నెట్ ఎండీ దినేష్‌కుమార్ నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని మాజీ ఛైర్మన్ జీవీ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ పెద్దలతో కలిసి కూటమి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారా ? అని ప్రశ్నించారు. ఈ పరిణామాల నేపథ్యంలో జీవీ రెడ్డిని సీఎం చంద్రబాబు మందలించినట్లు సమాచారం. దీంతో మనస్థాపానికి గురైన జీవీ రెడ్డి ఛైర్మన్ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఎండీ దినేష్‌కుమార్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆయన స్థానంలో ప్రవీన్ ఆదిత్యను నియమించింది.