SLBC టన్నెల్(SLBC Tunnel) కుప్పకూలి ఎనిమిది మంది కార్మికులు సొరంగంలోనే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. గత మూడ్రోజులుగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే లోపల కార్మికులు ఎలా ఉన్నారో మాత్రం తెలియరావడం లేదు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు నిత్యం పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం SLBC టన్నెల్‌కు వద్దకు వెళ్లాలని నిర్ణయించినట్లు మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తెలిపారు. తమ పర్యటనకు పోలీసులు ఆటంకం కలిగించొద్దని సూచించారు.
మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మాట్లాడుతూ.. ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంపై జ్యుడిషీయల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేస్తూనే ఈ ప్రమాదానికి కారణమైన బాధ్యులపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని కేటీఆర్ విమర్శించారు.