
రీచా గంగోపాధ్యాయ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న పేరు.

2010లో వచ్చిన ‘లీడర్’ సినిమాతో ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

తొలి సినిమాతోనే తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకుంది రీచా గంగోపాధ్యాయ. ఆ తర్వాత వెంకటేష్‌తో కలిసి ‘నాగవల్లి’ సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ అయింది.

అయితే ఈ సినిమా తర్వాత ‘మిరపకాయ్’తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేసింది. తర్వాత రవితేజతో ‘సారొచ్చారు’ సినిమా కూడా చేసింది. అయితే.. ప్రభాస్‌తో చేసిన ‘మిర్చి’ మాత్రం ఓ రేంజ్‌లో క్రేజ్ తెచ్చిపెట్టింది.

నాగార్జునతో కలిసి ఈ బ్యూటీ ‘భాయ్’ సినిమా చేసిన రీచా.. ఈ మూవీ తర్వాత రీచా సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది.

అనంతరం హైయర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్లిన రీచా.. తోటి స్టూడెంట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అమెరికాలోని మిచిగాన్‌లో అంగరంగ వైభవంగా వీళ్ల పెళ్లి జరిగింది.

2021లో రీచా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లో ఫ్యామిలీతో కలిసి జీవిస్తుంది.