ఏపీ ఫైబర్ నెట్ (AP Fiber Net) ఎండీగా ప్రవీణ్ ఆదిత్యను నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఏపీ గ్యాస్, డ్రోన్ కార్పోరేషన్ల అదనపు బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించారు.
సోమవారం ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. టిడిపి పార్టీ పదవులు కూడా వదులుకుంటున్నట్లు తెలిపారు.
ఈ మేరకు జీవీ రెడ్డి రాజీనామాకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఎండీ దినేష్ కుమార్‌కు ప్రభుత్వం జారీ చేసింది.
దీంతో ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్యను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES