తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు(Maha Shivaratri) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. భక్తులు వేకువజామున నుంచే ఆలయాలకు తరలివచ్చి శివయ్యను దర్శించుకుంటున్నారు. అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు.
- Advertisement -
దీంతో ప్రముఖ ఆలయాలైన శ్రీకాళహస్తి, శ్రీశైలం, కోటప్పకొండ, వేములవాడ, కీసర, తదితర ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో అధికారులు ఆలయాల వద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.