ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రధాని మోదీ (PM Modi)తో భేటీ అయ్యారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ భేటీలో విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలతో పాటు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత, కులగణనతో పాటు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లులపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే సెకండ్ ఫేజ్‌లో భాగంగా మెట్రో రైల్ కారిడార్‌ను హైదరాబాద్ శివారు ప్రాంతాలకు విస్తరించేందుకు చేపడుతోన్న డీపీఆర్‌ను ప్రధానికి వివరించారు.
రాష్ట్రంలో ప్రారంభించబోయే పలు ప్రాజెక్టులకు సంబంధించి నిధుల విడుదలపై విజ్ఞప్తి చేశారు. ఇక ఎస్‌ఎల్‌బీసీ(SLBC) టన్నెల్ ప్రమాద ఘటనను ప్రధానికి సీఎం వివరించినట్లు సమాచారం. టెన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను తీసుకొచ్చేందుకు కొనసాగుతోన్న సహాయక చర్యలను తెలిపారు. ప్రధానితో భేటీ అనంతరం పలువురు కేంద్రమంత్రులను రేవంత్‌రెడ్డి కలిసే అవకాశముంది.