ప్రతి ఇల్లు ఓంకార నాదంతో మారుమ్రోగాలని, లయకారుని కరుణ కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆకాంక్షించారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. బోలా శంకరుడు, కాశీ విశ్వేశ్వరుడు, సర్వాంతర్యామి అయిన మహాదేవుడు ఎల్లవేళలా దివ్య ఆశీస్సులు ప్రజలందరికీ ప్రసాదించాలని రాష్ట్ర మొత్తం ఓం నమశ్శివాయ పంచాక్షరి మంత్రంతో, ఓంకార డమరుక నాదాలతో మారుమోగుతూ మహా దేవుడిని ప్రార్థించాలని మంత్రి కోరారు.
రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం పరితపిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పై, రాష్ట్ర ప్రభుత్వంపై, రాష్ట్ర ప్రజలందరిపై ఆ పరమశివుని దివ్య ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఈ మహాశివరాత్రి సకల శుభాలు అందించాలని మనసారా కోరుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.