Saturday, April 19, 2025
Homeఇంటర్నేషనల్Sudan: సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం.. 46 మంది సైనికులు మృతి..!

Sudan: సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం.. 46 మంది సైనికులు మృతి..!

సూడాన్ (Sudan) లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి ఒక సైనిక విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 46 మంది సైనిక సిబ్బంది, పౌరులు మృతి చెందగా.. మరో 10 మంది గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు బుధవారం వెల్లడించారు.

- Advertisement -

ఈ ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికీ తెలియరాలేదని, దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఘటనాస్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు సూడాన్ పై పట్టు కోసం సైన్యం, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ మధ్య యుద్ధం ఇటీవల కాలంలో తీవ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో న్యాలా ప్రాంతంలో సైనిక విమానాన్ని కూల్చివేసినట్లు ఇటీవల డార్ఫర్ పశ్చిమ ప్రాంతాన్ని నియంత్రిస్తున్న RSF ప్రకటించింది. అయితే ప్రస్తుతం జరిగిన ప్రమాదం వీరి పనేనా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News