Wednesday, February 26, 2025
Homeచిత్ర ప్రభLucky Baskhar: సరికొత్త రికార్డు సృష్టించిన 'లక్కీ భాస్కర్'

Lucky Baskhar: సరికొత్త రికార్డు సృష్టించిన ‘లక్కీ భాస్కర్’

మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌(Dulquer Salmaan), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Baskhar). వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా దీపావళి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. నవంబర్‌ 28 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. తాజాగా ఈ చిత్రం సరికొత్త రికార్డు సృష్టించింది.

- Advertisement -

ఓటీటీలో విడుదలైన నాటి నుంచి 13 వారాలపాటు నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ఈ ఘనత అందుకున్న తొలి దక్షిణాది చిత్రంగా రికార్డు సొంతం చేసుకుంది. ఈమేరకు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది. ప్రేక్షకుల అభిమానానికి ధన్యవాదాలు అని తెలిపింది.

బ్యాంకింగ్ సెక్టార్‌ నేపథ్యంలో ‘లక్కీ భాస్కర్‌’ తెరకెక్కింది. బ్యాంకింగ్ వ్యవస్థ, స్టాక్‌ మార్కెట్, కుటుంబ విలువలతో దర్శకుడు ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచారు. భాస్కర్‌కుమార్‌ పాత్రలో దుల్కర్‌ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఇక పాటలు, నేపథ్య సంగీతం విశేషంగా ఆకట్టుకున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News