Wednesday, February 26, 2025
HomeఆటChampions Trophy: చరిత్ర సృష్టించిన అఫ్గాన్ బ్యాటర్.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే..?

Champions Trophy: చరిత్ర సృష్టించిన అఫ్గాన్ బ్యాటర్.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే..?

ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో భాగంగా అఫ్ఘానిస్థాన్‌ – ఇంగ్లండ్‌(AFG vs ENG) మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన నెగ్గిన అఫ్ఘానిస్థాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టుకు 37 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓవైపు మిగతా బ్యాటర్లు విఫలమవుతున్నా.. ఇబ్రహీం జద్రాన్(ibrahim zadran) సెంచరీతో అదరగొట్టాడు. 3 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో 106 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకన్నాడు. అఫ్ఘానిస్థాన్‌ తరపున ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ బాదిన తొలి బ్యాటర్ కావడం విశేషం.

- Advertisement -

సెంచరీ అనంతరం కూడా ధాటిగా ఆడుతూ 177 పరుగులకు ఔట్ అయ్యాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. దీంతో ఆఫ్ఘాన్ 50 ఓవర్లలో 325/7 పరుగుల భారీ స్కోర్ చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్‌ 6, అటల్ 4. రహ్మత్ షా 4, షాహిది 40 , ఒమర్జాయ్ 41, మహ్మద్ నబీ 40 పరుగులు చేశారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు, లివింగ్ స్టోన్ రెండు వికెట్లు, అదిల్ రషీద్, ఓవర్‌టన్ చెరో వికెట్ తీశారు. భారీ లక్ష్యంతో బరిలో దిగనున్న ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తిరంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News