ఫిబ్రవరి 27 తేదీన జరగనున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించబడేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు అన్నారు.
ఎన్నికల నిర్వహణకు బందోబస్తు ఏర్పాట్లు
జిల్లా వ్యాప్తంగా 77 పోలింగ్ కేంద్రాలలో 63114 (35195 మంది పురుషులు ,27915 మహిళలు) మంది పట్టబద్రులు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలకు మొత్తం 483 మంది పోలీసు అధికారులు సిబ్బందితో పటిష్ట బందోబస్తును నిర్వహిస్తున్నాము.
బందోబస్తుకు డిఎస్పీలు- 4, సిఐలు – 18, ఎస్సైలు -30 , ASI/HC -82, కానిస్టేబుల్స్- 239, ఆర్మూర్ రిజర్వ్ సిబ్బంది – 70, హోమ్ గార్డ్స్-40 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.సిబ్బందికి అదనంగా 15 రూట్ మొబైల్స్, సర్కిల్ కి ఒకటి చొప్పున 13 స్ట్రైకింగ్ ఫోర్స్, సబ్ డివిజన్ కు ఒకటి చొప్పున 4 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ లతో నిరంతర గస్తి ఏర్పాటు చేయడం జరిగింది.
ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ జరిగిన తక్షణమే శాంతి భద్రతలను అదుపులోకి తీసుకోవడానికి సిబ్బంది అందరూ 24×7 అందుబాటులో ఉంటారు. పోలింగ్ కేంద్రాల వద్ద గ్రామాలలో పోలింగ్ ప్రదేశాలలో గొడవలకు పాల్పడే వారిని, గత నేర చరిత్ర కలిగిన వారిని ముందుగానే గుర్తించి వారిని బైండోవర్ చేయడం జరిగింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రతిరోజు పోలీసు అధికారులు సిబ్బంది ఆ ప్రాంతాలను సందర్శిస్తూ ముందస్తు ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారు.
ఎన్నికలు జరిగే రోజు చేయకూడనివి.
జిల్లా వ్యాప్తంగా Crpc 144 సెక్షన్ మరియు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్న కారణంగా ఐదు మంది కన్నా ఎక్కువమంది గుమి గూడ రాదు.పోలీస్ వారి అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, ఎలాంటి ఇతర కార్యక్రమాలు నిర్వహించరాదు. అలా నిర్వహిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో DRY DAY కావున ఎలాంటి మద్యం అమ్మకాలు, మద్యం సేవించి పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు చేయడం వంటివి నిషేధం. పోలింగ్ జరిగే సమయంలో పార్టీలకు సంబంధించిన ప్రచారాలు చేయడం గాని, పార్టీ గుర్తుకు సంబంధించిన కరపత్రాలు గాని ప్రదర్శించడం వంటివి గాని, పోలింగ్ జరిగే సమయంలో ఓటర్లను ప్రభావితం చేయడం వంటివి చేయరాదు.
ఎన్నికల నియావళి అమల్లో ఉన్న నేపథ్యంలో పట్టభద్రులను ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా చర్యలు చేపట్టాము. ఎవరైనా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి వెనకాడేది లేదు. ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ఎన్నికల నిర్వహించడానికి పోలీసు వారికి సహకరించాలని, ఏ ప్రాంతంలోనైనా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే చర్యలు మీ దృష్టికి వచ్చినట్లయితే పోలీస్ వారి హెల్ప్ లైన్ నెంబర్లయిన డయల్-100,112 కు సంప్రదించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని తెలియజేశారు.