Wednesday, February 26, 2025
HomeఆటMS Dhoni: చెన్నైలో ధోనీ జస్ట్ వాక్ తో సోషల్ మీడియా షేక్.. అట్లుంటది THALA...

MS Dhoni: చెన్నైలో ధోనీ జస్ట్ వాక్ తో సోషల్ మీడియా షేక్.. అట్లుంటది THALA తో..!

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. వేసవి వినోదంగా వచ్చే ఈ మెగా టోర్నీ కోసం క్రీడాభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ చెన్నైలో అడుగుపెట్టాడు. దీంతో అతడికి చెన్నై విమానాశ్ర‌యంలో ఘ‌న ‌స్వాగ‌తం ల‌భించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను చెన్నై సూపర్ కింగ్స్ తన అధికార సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

- Advertisement -

ఈ ఫొటోల్లో మహేంద్రుడు బ్లాక్ అండ్ బ్లాక్ ధరించి, కళ్లజోడు పెట్టుకుని ఎంతో కూల్‌గా వాకింగ్ చేస్తూ కనిపించాడు. అభిమానులు అత‌డిని చూసేందుకు పోటెత్తారు. ధోనీకి భారీ పోలీసు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఇక ఐపీఎల్ 2023 కోసం ధోనీ సన్నద్ధమవుతున్న‌ట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం టీమిండియా వరల్డ్ కప్ ట్రోఫీ ఆడుతోంది. తొలి మ్యాచ్ లో బంగ్లాను మట్టి కరిపించిన భారత్.. రెండో మ్యాచ్ లో పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. అయితే ఇదే సమయంలో ధోనీ చెన్నై లో ఎంట్రీ ఇవ్వడంతో.. అందరూ ఐపీఎల్ మూడ్ లోకి వెళ్లిపోయారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ త్వరలోనే ట్రైనింగ్ క్యాంప్‌ను ప్రారంభించనుంది. ఈ ట్రైనింగ్ క్యాంపులో పాల్గొనేందుకు తాజాగా మహీ చెన్నైకు చేరుకున్నాడు. అక్కడ మహీతో పాటు మరికొంతమంది ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ చేయనున్నారు. ఇక చెన్నైకు వెళ్లిన మహీని CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రిసీవ్ చేసుకున్నాడు. ఇద్దరు కౌగలించుకుని, కాసేపు ముచ్చటించుకున్నారు.

ఈ ఐపీఎల్ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. CSK తన తొలి మ్యాచ్‌ను మార్చి 23న చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఆడ‌నుంది. ముంబ‌యి ఇండియ‌న్స్‌తో చెన్నై ఢీకొనేందుకు సిద్ధంగా ఉంది. రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే చెన్నై సూప‌ర్ కింగ్స్ ధోనీ సార‌థ్యంలో ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని కైవ‌సం చేసుకుంది. ఈ సారి కూడా ఎలాగైనా యంగ్ కెప్టెన్ సారథ్యంలో టైటిల్‌ను సాధించుకోవాలని పట్టుదలతో ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News