ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(Kumbh Mela) బుధవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. 40 రోజుల పాటు జరిగిన ఈ కుంభమేళాకు దాదాపు 90 కోట్లకు పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివెళ్లారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. తెలుగు వారికి ఇబ్బంది కలగకుండా ప్రధాన రహదారులపై దారులను సూచించే సైన్ బోర్డులపై ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు తెలుగు(Telugu Sign Boards)ను చేర్చారు.
దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే తెలుగు పర్యాటకులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ఉత్తరాదిలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఇకపై తెలుగు సైన్ బోర్డులు దర్శనం ఇవ్వనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు కాశీ, బద్రీనాథ్, వారణాసి, అయోధ్య, చార్‌ధామ్ యాత్రలకు వెళ్తుంటారు. దీంతో తెలుగులో బోర్డులు ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగపడనుంది. దీంతో ఉత్తరాది రాష్ట్రాల్లో తెలుగు భాషకు గౌరవం దక్కిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
