పోసాని కృష్ణమురళి అరెస్టును వైసీపీ అధినేత జగన్(YS Jagan) ఖండించారు. పోసానిని అక్రమంగా అరెస్ట్ చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసాని సతీమణి కుసుమలతను ఫోన్లో పరామర్శించారు. భయపడొద్దని.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
- Advertisement -
కాగా పోసాని కృష్ణమురళిని హైదరాబాద్లో గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఏపీకి తరలించారు. ప్రస్తుతం కడపలోని ఓ రహస్య ప్రాంతంలో ఆయనను విచారించారు. కాసేపట్లో రాజంపేట కోర్టులో హాజరుపర్చనున్నారు.