రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందని మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ భాష మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం జరుగుతున్నదని విమర్శించారు. విమర్శలను కూటమి ప్రభుత్వం తట్టుకోలేక పోతుంది అందుకే పోసాని అరెస్టు చేశారని వ్యాఖ్యానించారు.
- Advertisement -
ప్రజల రక్షణకు కాక రాజకీయ కక్షలకు పోలీసులను వాడుకుంటున్నారని ఫైరయ్యారు. పోసాని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నమని చెప్పారు. ఎన్నికలలో వచ్చిన హామీలను అమలు చేయకుండ వైసీపీ నాయకుల పైన కక్ష సాధింపు చర్యలు అమలు చేస్తున్నారని విమర్శించారు.
ఇప్పటికే పోసాని అరెస్ట్‌ను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. పోసాని భార్యకు ఫోన్ చేసి పరామర్శించారు. పోసాని కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.