దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తన సినిమాలతో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్చపరుసున్నారు. ఇప్పటివరకు అపజయమే లేకుండా వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. బాహుబలితో ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేశారు. RRR మూవీతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకునేలా విజయం సాధించారు. తన పని తాను చేసుకుంటూ వివాదాలకు దూరంగా ఉండే రాజమౌళి తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన స్నేహితుడు శ్రీనివాస్ రావు రాజమౌళి టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సంచలన వీడియో విడుదల చేశారు.
ఆయన వీడియోలో ఏమన్నారంటే..
“యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాను. రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉంది. ఓ అమ్మాయి కారణంగా మా మధ్య ట్రయంగిల్ లవ్ స్టోరీతో విభేధాలు మొదలయ్యాయి. ముందు రాజమౌళి..ఆ తర్వాత నేను ప్రేమించానని..అయితే కేరియర్ బిగినింగ్ టైమ్‌లో వివాదం వద్ధనుకుని.. రాజమౌళి కోరిక మేరకు నేను ఆ అమ్మాయిని త్యాగం చేశాను. ఇన్నాళ్లకు అతను నెంబర్ వన్ డైరక్టర్ అయ్యాక గతంలోని విషయాలు ఎవరికో చెప్పానన్న అనుమానంతో నన్ను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో అతని టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను.
54ఏళ్ల వయసులో నేను రాజమౌళి టార్చర్ భరించలేకపోతున్నానని..నేను ఇదంతా పబ్లిసిటీ కోసం చేయడం లేదను. నేను చెప్పిన విషయాలపై పోలీసులు వారిని లై డిటెక్టర్ టెస్టులు చేయాలని కోరుతున్నాను. రాజమౌళికి మాంత్రిక విద్యలు కూడా తెలుసని తనకు పోటీగా ఉన్న డైరక్టర్లందరిని తొక్కివేశాడు. ఇప్పుడు మరికొందరు డైరక్టర్లను లక్ష్యంగా చేసుకున్నాడు. వీటన్నింటిపై నిజాలు తెలియాలంటే అతడికి లై డిటెక్టర్ పరీక్షలు చేయాలి. దీని ఆధారంగా రాజమౌళిపై సుమోటో కేసు నమోదు చేయాలి” అని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది.