Thursday, February 27, 2025
Homeపాలిటిక్స్Posani: ఓబులవారిపల్లి P.S కు చేరుకున్న సినీ నటుడు పోసాని కృష్ణ మురళి

Posani: ఓబులవారిపల్లి P.S కు చేరుకున్న సినీ నటుడు పోసాని కృష్ణ మురళి

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కు సినీ నటుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య పోసాని కృష్ణ మురళి ఇక్కడికి తీసుకువచ్చారు. ఓబులవారిపల్లి స్టేషన్లో పోసాని పై 195(1),115(1),74,79 రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

- Advertisement -

చెన్న రాజు పొడు, మాజీ సర్పంచ్ జోగినేని మణి ఫిర్యాదు మేరకు ఓబులవారిపల్లిలో పోసానిపై కేసు నమోదు చేశారు.ఈ పోలీస్ స్టేషన్లో పోసానిని పోలీసులు విచారించనున్నారు. విచారణ అనంతరం రైల్వే కోడూరులో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం రైల్వే కోడూరు కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.

గతంలో చంద్రబాబు, పవన్ పై పోసాని కృష్ణ మురళి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా చేసిన పోసాని వ్యాఖ్యలపై కేసు నమోదు చేశారు పోలీసులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News