సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్(Anjani Kumar) తెలంగాణ నుంచి రిలీవ్ కావడంతో ఏపీలో రిపోర్టు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో అంజనీ కుమార్ ఏపీకి కేటాయించబడ్డారు. కానీ గత పదేళ్లుగా ఆయన తెలంగాణలోనే పని చేస్తున్నారు. ఈ క్రమంలో అంజనీ కుమార్‌ను ఏపీకి వెళ్లాలని కేంద్రహోంశాఖ ఇటీవల ఆదేశించింది. కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం అంజనీ కుమార్‌ను రిలీవ్ చేసింది. దీంతో ఆయన ఏపీలో రిపోర్టు చేయాల్సి వచ్చింది. గతంలో తెలంగాణ డీజీపీగా పనిచేసిన ఆయనకు ఏపీ ప్రభుత్వ ఎలాంటి పోస్టు ఇస్తుందో వేచి చూడాలి.
ఇక అంజనీ కుమార్‌తో పాటు రిలీవ్ అయిన మరో ఐపీఎస్ ఆఫీసర్ అభిలాష బిష్ట్ మాత్రం క్యాట్‌ను ఆశ్రయించారు. డీవోపీటీ ఉత్తర్వులపై స్టే విధించాలని ఆమె కోరారు. ఈ పిటిషన్‌పై స్పందించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు క్యాట్ నోటీసులు జారీ చేసింది. ప్రతివాదుల వాదనలు విన్న తరువాత తీర్పు వెళ్లడిస్తామని స్పష్టం చేసింది. కానీ అప్పటి వరకు డీవోపీటీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. వెంటనే ఏపీకి వెళ్లి రిపోర్టు చేయాల్సిందిగా క్యాట్ ఆదేశించింది.