Friday, February 28, 2025
Homeపాలిటిక్స్Posani: పోసాని కృష్ణ మురళికి వైద్య పరీక్షలు పూర్తి

Posani: పోసాని కృష్ణ మురళికి వైద్య పరీక్షలు పూర్తి

సినీనటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్ గురు మహేష్ తెలిపారు. పోలీసు విచారణకు ఆరోగ్య సమస్యలు ఎదురుకావని పేర్కొన్నారు.

మరో వైపు పోసాని కృష్ణ మురళిని కలిసేందుకు ఆయన తరఫు న్యాయవాది నాగిరెడ్డి ఓబులవారిపల్లె పీఎస్ కు రాగా పోలీసులు అనుమతించలేదు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా లోపలికి పంపలేమని సీఐ చెప్పడంతో ఆయన వెనుదిరిగారు.

- Advertisement -

వైసీపీ నేత కొరముట్ల శ్రీనివాసులు పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ కి వచ్చి పోసానిని చూడాలని పట్టుబట్టారు. తమ విధులకు ఆటంకం కలిగించవద్దని పోలీసులు హెచ్చరించడంతో వెనుదిరిగారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News