ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. విశాఖలోని గీతం వర్సిటీ వేదికగా నిర్వహించే అతిపెద్ద కెరీర్ ఫెయిర్ నిర్వహించనుంది. ఈమేరకు మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ఎక్స్ వేదికగా తెలిపారు. 49 దిగ్గజ ఐటీ కంపెనీలు, ఐటీ ఆధారిత కంపెనీల్లో 10వేలకు పైగా ఉద్యోగావకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఈ కెరీర్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఏపీ ఉన్నత విద్యామండలి, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (NASSCOM) ఈ మేళా నిర్వహిస్తోందన్నారు. మార్చి 5, 6 తేదీల్లో ఈ కెరీర్ ఫెయిర్ ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. 2004-2025 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత అయిన విద్యార్థులు ఇందులో పాల్గొనేందుకు అర్హులు. అభ్యర్థులు మార్చి 3లోగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి.