Thursday, February 27, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్రంజాన్ సందర్భంగా ప్యారడైజ్ హోటల్ లో కొత్త హలీమ్

రంజాన్ సందర్భంగా ప్యారడైజ్ హోటల్ లో కొత్త హలీమ్

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్యారడైజ్ హోటల్ సరికొత్త హలీమ్ రుచులను అందించేందుకు సిద్ధమైనట్లు ప్యారడైజ్ CEO గౌతమ్ గుప్తా తెలిపారు. జష్ణ్ పేరుతో ఈ ఏడాది హలీమ్ ప్రియులకు నూతన రుచులను ఆస్వాదించే విధంగా ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. రంజాన్ మాసం నేపథ్యంలో ప్రత్యేకంగా రూపొందించిన ఇఫ్తార్ బాక్స్ ను కూడా ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.

- Advertisement -

29 రకాల మసాలా దినుసులు, నాణ్యతతో కూడిన పదార్థాలతో మటన్, చికెన్ హలీం తయారు చేస్తున్నట్లు తెలిపారు. నాణ్యత, రుచి, భద్రతకు మారుపేరుగా ప్యారడైజ్ కొన్ని దశాబ్దాలుగా రంజాన్ మాసంలో హలీం తయారు చేసి వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం ప్యారడైజ్ హోటల్లో ఇఫ్తార్ బాక్స్ తో పాటు హలీం ను రుచి చూడాలని ఆయన వినియోగదారులను కోరారు.

వినియోగదారులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ ప్రతి ఏటా సరికొత్త రుచులతో ముందుకు వస్తున్నట్లు తెలిపారు. ప్యారడైజ్ హోటల్లో డైనింగ్ తో పాటు పార్సల్ సదుపాయం కూడా కల్పించినట్లు, అన్ని ప్యారడైజ్ అవుట్ లెట్లలో హలీం లభిస్తుందని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News