
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.

ఉంగరాల జుట్టు, చూడచక్కని రూపంతో కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది.

మలయాళ ప్రేమమ్ సినిమాతో సినీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది అనుపమ. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఈ సినిమాలో కనిపించింది కాసేపు మాత్రమే అయినప్పటికీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక తెలుగులో నితిన్ హీరోగా నటించిన.. అఆ సినిమాలో నటించి మెప్పించింది.

తెలుగు, తమిళం, మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుని ఈ బ్యూటీ రోజు రోజుకు మరింత పాపులర్ అవుతోంది.

చూడచక్కని రూపం.. అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. కానీ అనుపమకు అనుకున్నంతగా సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

తాజాగా రెడ్ కలర్ చీర, అందుకు తగ్గట్టుగా యెల్లో కలర్ బ్లౌజ్ ధరించి అందాలతో ఆకట్టుకుంటోంది అనుపమ.

సాంప్రదాయంగా కనిపించి. మరింత అందంగా మెరిసిపోతోంది అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.