కొత్త సంవత్సరంతో ప్రారంభం బంగారం ధరల్లో కొన్ని మార్పులు కనిపించినప్పటికీ, ఫిబ్రవరి నెల మాత్రం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి నెల ప్రారంభం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ ధరలు పెట్టుబడిదారులు, సాధారణ ప్రజలు, వ్యాపారులు, ఉత్పత్తిదారులందరినీ ఆందోళనకు గురిచేసింది.
ఇందుకు తగ్గట్టు, ఇండియాలో బంగారం ధర పెరగడం సామాన్య ప్రజలు, వ్యాపారులు, ఉత్పత్తిదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బంగారం కొనుగోలు చేసే వారు ఈ అధిక ధరలతో కొనాలా వద్దా అని సతమతమవుతున్నారు. గతంలో ఎన్నో సార్లు బంగారం ధరలు పెరిగినప్పటికీ, ఈసారి ధరలు ఎంతో పెరిగాయి.
ఫిబ్రవరి 26న 22 క్యారట్ల బంగారం ధర రూ.8050 (ఒక గ్రాముకు)గా ఉంది, అంటే 10 గ్రాముల బంగారం ధర రూ.80500 ఉంది. అదే 24 క్యారట్ల బంగారం ధర రూ.8782 (ఒక గ్రాముకు)గా ఉంది. 10 గ్రాముల ధర రూ.87820 గా ఉంది.
ఫిబ్రవరి 27న, 22 క్యారట్ల బంగారం ధర ఒక గ్రాముకి రూ.8010 వరకు తగ్గింది. అంటే 10 గ్రాముల బంగారం ధర రూ.80100 కి చేరింది. అలాగే, 24 క్యారట్ల బంగారం ధర ఒక గ్రాము రూ. 8738 తగ్గింది, అంటే 10 గ్రాముల ధర రూ.87380.
అయితే, ఈ రోజు బంగారం ధరలు కొంచెం తగ్గినట్లు కనిపించాయి. 22 క్యారట్ల బంగారం ధర రూ.50 లు తగ్గి రూ.7960కి చేరింది. 10 గ్రాముల ధర రూ.79600గా ఉంది. అదే 24 క్యారట్ల బంగారం ధర రూ.54 లు తగ్గి రూ.8684 చేరింది. 10 గ్రాముల ధర రూ.86840 గా ఉంది. నిపుణులు చెబుతున్నట్టుగా, ఈ ధరలు క్రమంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. వచ్చే నెలలో బంగారం ధరలు మరింత తగ్గవచ్చు.