బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao)కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీసులు ఆయనపై 351(2) R/W3, (5) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హరీశ్ రావుతో పాటు మరో ముగ్గురి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను నిత్యం చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని చక్రధర్ గౌడ్ తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు FIR నమోదు చేశారు. ఏ1గా వంశీకృష్ణ, ఏ2గా హరీశ్‌రావు, ఏ3గా సంతోష్ కుమార్, ఏ4గా రాములు, ఏ5గా వంశీ పేర్లను చేర్చారు.