ఉత్తరాఖండ్(Uttarakhand)లో మంచు బీభత్సం(Snowstorm Disaster) సృష్టించింది. బద్రీనాథ్‌కు దగ్గరలోని మనా గ్రామంలో సైనికుల కోసం వేస్తున్న రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా కార్మికులు మంచును తొలగిస్తున్న క్రమంలో ఒక్కసారిగా హిమపాతం ముంచేసింది. ఈ ఘటనలో 57 మంది కార్మికులు మంచుచరియల కిందనే చిక్కుకుపోయారు. రెస్క్యూ టీమ్స్ 10 మందిని రక్షించాయి. మిగతా వారిని రక్షించడానికి రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఇప్పటికీ మంచు దట్టంగా కురుస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.
డెహ్రాడూన్‌లోని గౌచర్, సహస్త్రధారలోని హై ఆల్టిట్యూడ్ రెస్క్యూ టీమ్‌లను సిద్ధంగా ఉంచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హిమపాతంపై స్పందించారు. చమోలి జిల్లాలోని మానా గ్రామం సమీపంలో బీఆర్వో చేపడుతున్న నిర్మాణ పనుల సమయంలో చాలా మంది కార్మికులు హిమపాతం కింద చిక్కుకున్నట్లు తెలిసింది. ఐటీబీపీ, బీఆర్వో, ఇతర రెస్క్యూ టీమ్‌లు రెస్క్యూ ఆపరేషన్‌లను నిర్వహిస్తున్నాయని కార్మికులు ప్రాణాలతో బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేశారు.