ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా బంగ్లాదేశ్, పాకిస్థాన్‌పై విజయం సాధించి.. సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇక లీగ్ దశలో తన చివరి మ్యాచ్ న్యూజిలాండ్‌తో ఆడనుంది భారత్. అయితే చివరి గ్రూప్ మ్యాచ్‌లో మేనేజ్‌మెంట్, రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చి, గిల్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ తొడ పిక్కలకు గాయమైంది. దీంతో హిట్‌మ్యాన్ బ్యాటింగ్ చేసేటప్పుడు క్రీజులో ఇబ్బంది పడ్డాడు. వంద శాతం ఫిట్‌గా ఉన్నట్లు కనిపించలేదు. ఈ మ్యాచ్ అనంతరం దుబాయ్‌లో జరిగిన టీమ్ ఇండియా ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ బ్యాటింగ్ చేయలేదు. దీంతో హిట్‌మ్యాన్ ఫిట్‌నెస్ ప్రాబ్లమ్స్‌తో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
రోహిత్ ఒక్కడే నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయలేదు. ఈ సెషన్‌లో రోహిత్, కోచ్ గౌతమ్ గంభీర్‌తో గేమ్ ప్లానింగ్ గురించి చాలాసేపు మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే రోహిత్ గాయం మరీ పెద్దది కాకపోవచ్చు. న్యూజిలాండ్ మ్యాచ్‌కు రోహిత్‌కు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. న్యూజిలాండ్‌తో భారత్ ఆడే మ్యాచ్‌కు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. ఎందుకంటే ఇప్పటికే రెండు టీమ్స్ సెమీస్‌కు వెళ్లాయి. మ్యాచ్‌లో గెలిచిన టీమ్, గ్రూప్ A విన్నర్‌గా ఉంటుంది. ఒక్క రోజు గ్యాప్‌లో (మార్చి 4) భారత్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో చివరి గ్రూప్ మ్యాచ్‌కు రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వడం మంచిదనే అభిప్రాయానికి టీమ్ మేనేజ్‌మెంట్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఒకవేళ రోహిత్ శర్మ నిజంగా చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌కు అందుబాటులో లేకుంటే లేదా సెమీ-ఫైనల్‌ను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయిస్తే.. రైట్ హ్యాండర్ రిషబ్ పంత్ లేదా వాషింగ్టన్ సుందర్ ఫైనల్ ఎలెవన్‌లోకి రావచ్చు. అయితే ఇండియాకు బ్యాకప్ ఓపెనర్ లేకపోవడం పెద్ద మైనస్. టీమ్ ఇండియా స్క్వాడ్‌లో యశస్వి జైస్వాల్‌ను తీసేసి, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని యాడ్ చేశారు. ఒకవేళ రోహిత్ రెస్ట్ తీసుకుంటే, KL రాహుల్ ఓపెనింగ్ ఆప్షన్‌గా ఉన్నాడు. కానీ గత రెండు, మూడు సంవత్సరాలుగా రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో సెట్ అయ్యాడు. ఒకవేళ అతడి పొజిషన్‌ను మార్చకూడదు అనుకుంటే, పంత్‌ను ఓపెనర్‌గా పంపించవచ్చు. పంత్‌కు పొట్టి ఫార్మాట్లలో ఓపెనర్‌గా ఆడిన అనుభవం ఉంది. రోహిత్ మాదిరిగానే అతడు పవర్‌ప్లేలో దూకుడుగా ఉండగలడు.
ఐపీఎల్‌లో శుబ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. అంతకు ముందు జింబాబ్వేలో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడిన యంగ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సిరీస్‌ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్ సిరీస్, ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి భారత వైస్ కెప్టెన్‌గా గిల్ సెలక్ట్ అయ్యాడు. దీంతో అతడు ఫ్యూచర్‌లో టీమ్ ఇండియాకు వన్డే కెప్టెన్‌గా ఎంపికవ్వడం ఫిక్స్ అయింది. వన్డే ర్యాకింగ్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండటం కూడా గిల్ కెప్టెన్సీ ఎలివేషన్‌కు ఒక కారణం.