శ్రీశైలం లెప్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్(SLBC Tunnel) కుప్పకూలి ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఐదు రోజులుగా వారిని బయటకు తీసుకువచ్చేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను బయటికి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు.
రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిరంతరం సమీక్ష నిర్వహించారు. కానీ వారి ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయినట్లు సమాచారం. టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవ సమాధి అయినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో ఐదుగురు కార్మికలు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నట్లు చెబుతున్నారు.