లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతరను అనంతపురం గంగమ్మ జాతర(Gangamma jathara) అని కూడా అంటారు. ఈ జాతరను అన్నమయ్య జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలంలోని గంగమ్మ దేవస్థానంలో ఘనంగా జరుగుతుంది. నేడు ప్రారంభమైన ఈ జాతర రేపు కూడా కొనసాగుతుంది.
గంగమ్మను దర్శించుకోవడానికి రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. చల్లంగా చూడు తల్లి అంటూ వేడుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు.చలువ పందిళ్ళు, త్రాగునీరును ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరో వైపు ఇక్కడ చక్కభజనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి. సాయంత్రం చందినీ బండ్లను విద్యుత్ దీపాలతో అలకరించి వైభవంగా నిర్వహించనున్నారు. ఇక్కడికి రాయలసీమ వ్యాప్తంగా జనాలు వచ్చి సందడి చేస్తున్నారు.
Jathara: లక్కిరెడ్డిపల్లిలో ఘనంగా గంగమ్మ జాతర
- Advertisement -