Saturday, March 1, 2025
Homeఇంటర్నేషనల్Trump-Zelensky: ట్రంప్-జెలెన్ స్కీ వివాదం.. ఉక్రెయిన్ రాయబారి ఏం చేశారంటే..?

Trump-Zelensky: ట్రంప్-జెలెన్ స్కీ వివాదం.. ఉక్రెయిన్ రాయబారి ఏం చేశారంటే..?

కొన్ని సంవత్సరాలుగా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ యుద్ధం వల్ల ఇరు దేశాల్లో అనేక మంది సైనికులు, సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో దేశాలు యుద్ధం ఆపడానికి ప్రయత్నించినా కుదరలేదు. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Trump) బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడుతుందని భావించారు. ఇందులో భాగంగా ఈ యుద్ధానికి తెరదించి శాంతి ఒప్పందం కుదర్చడానికి ట్రంప్ సిద్ధమయ్యారు. ఇందుకు బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా ప్రత్రిపాదనపై సంతకం చేసేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ(Zelensky) అమెరికా వెళ్లారు. వైట్‌ హౌస్‌లో ట్రంప్‌తో భేటీ అయ్యారు.

- Advertisement -

అయితే వీరిద్దరి భేటీ వాగ్వాదానికి దారి తీసింది. మీడియా ఎదుటే ఇద్దరు మాటల యుద్ధానికి దిగారు. జెలెన్‌స్కీ వల్లే శాంతి ఒప్పందం జరగట్లేదని.. ఆయన వల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశముందని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. జెలెన్‌ స్కీ కూడా అదే స్థాయిలో బదులివ్వడంతో ఇద్దరి నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అమెరికాతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం రష్యాతో శాంతి ఒప్పందానికి జెలెన్ స్కీ సుముఖంగా లేరని అర్ధమైందంటూ ట్రంప్ తెలిపారు. ఆ వెంటనే ఉక్రెయిన్‌కు న్యాయమైన, శాశ్వత శాంతి అవసరమని.. దాని కోసమే తాను కృషి చేస్తున్నాను అని జెలెన్ స్కీ ట్వీట్ చేశారు.

అయితే ట్రంప్ -జెలెన్ స్కీ మధ్య వివాదం కొనసాగుతున్న వేళ మీడియా సమావేశంలో ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవా తల పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదేంటి ఇలా జరగుతుందని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మరోవైపు రష్యా కూడా ఈ ఘటనపై వ్యంగ్యంగా స్పందించింది. ఇంకా నయం జెలెన్ స్కీని ట్రంప్ కొట్టలేదని సెటైర్లు వేసింది. ఇక యూరప్ దేశాలు మాత్రం జెలెన్‌ స్కీకి మద్ధతుగా నిలిచాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News