Saturday, March 1, 2025
Homeఆంధ్రప్రదేశ్GV Reddy: ఏపీ బడ్జెట్‌పై జీవీ రెడ్డి సంచలన పోస్ట్

GV Reddy: ఏపీ బడ్జెట్‌పై జీవీ రెడ్డి సంచలన పోస్ట్

కూటమి ప్రభుత్వం ఏపీ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్(AP Budget) ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్‌పై ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన జీవీ రెడ్ది(GV Reddy) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సీఎం చంద్రబాబును ప్రశంసిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

“నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం రూ. 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే రూ. 3 లక్షల 22 వేల కోట్ల బారి బడ్జెట్‌ను ప్రణాళికబద్ధంగా రూపొందించారు. నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుంది. తక్కువ కాలంలోనే టీడీపీలోనూ, ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశానికి నేను ఎప్పటికీ మా సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి . రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత” అని పేర్కొన్నారు.

కాగా ఇటీవల ఏపీ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ ఎండీ దినేష్‌కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేయడం.. అనంతరం సీఎం చంద్రబాబు కాస్త మందలించడంలో ఆ సంస్థ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అంతేకుండా టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేడయం టీడీపీ క్యాడర్‌ను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. అధికారులకు భయపడుతూ పార్టీ కోసం కష్టపడిన క్యాడర్‌ను చంద్రబాబు పక్కన పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News