తెలంగాణలో మల్లీప్లెక్స్‌ల(Multiplex)కు భారీ ఊరట దక్కింది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు 16 ఏళ్ల లలోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని హైకోర్టు(TG High Court) ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలపై మల్టీప్లెక్స్ యాజమాన్యం మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. పిల్లల ప్రవేశంపై ఆంక్షల వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని తెలిపింది. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునేవరకు అంక్షలను ఎత్తివేయాలని కోరింది.
ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. 16 సంవత్సరాల లోపు పిల్లలను అన్ని షోలకు అనుమతించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే తొక్కిసలాటకు అవకాశమున్న ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు మాత్రం చిన్నారులకు అనుమతి లేదని స్పష్టం చేసింది. సాధారణ షోలకు మాత్రమే అనుతిస్తున్నట్లుగా కోర్టు పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను కోర్టు మార్చి 17కు వాయిదా వేసింది.