సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) జైలులో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో రాజంపేట సబ్ జైలు సిబ్బంది ఆయనను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి కడప రిమ్స్ లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పలు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. తనతో ములాఖత్ అయ్యేందుకు వచ్చిన వారితో తనకు ఆరోగ్యం బాగోలేదని, విరేచనాలు అవుతున్నాయని పోసాని వాపోతున్నట్లు చెబుతున్నారు. దీంతో వైద్యులను పిలిపించి పోసానికి వైద్య చికిత్స అందించారు. ఇవాళ మరోసారి అస్వస్థతకు గురికావడంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్ జైలుకు తరలించారు.